Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

ఏపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది ?

   ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో గెలిచేది మేమే అంటోంది అధికార వైసీపీ. సర్వేలు మాకే అనుకూలం అంటోంది టీడీపీ-జనసేన కూటమి. జగన్ గెలుపు కష్టమేనని గతంలో వైసీపీ విజయానికి కృషి చేసిన ప్రశాంత్ కిషోర్ అంటున్నారు. మరి.. ఇంతకీ ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ? సర్వేలు చెప్పిన ఫలితాలను ఎంతవరకు నమ్మవచ్చు..?

   సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూలు ఇంకా రాలేదు కానీ.. అప్పుడే ఏపీలో గెలిచేది ఫలానా వాళ్లంటూ సర్వేలు ఇవ్వడం మొదలుపెట్టాయి ఆయా సంస్థలు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అధికార, విపక్షాలు పూర్తిగా అభ్యర్థుల్ని కూడా ప్రకటించలేదు. ఇప్పటికే ప్రకటించిన వాళ్లనూ ఆయా పార్టీలు మార్చే పరిస్థితులు ఉన్నాయి. అయినా..సర్వేలతో హోరెత్తుతోంది ఆంధ్రప్రదేశ్. అదేమంటే పార్టీల పరంగా ఆయా స్థానాల్లో సర్వేలు చేశామంటున్నాయి సదరు సంస్థలు.

      సర్వేల సంగతి ఎలా ఉన్నా.. రానున్న ఎన్నికల్లో గెలుపు మాదేనని బల్లగుద్ది మరీ చెబుతోంది వైసీపీ. ఇక, ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ మరో అడుగు ముందుకేసి ఎన్నికల తర్వాత విశాఖ పట్టణంలోనే ప్రమాణస్వీకారం చేస్తానని ప్రకటించి..సంచలనం సృష్టించారు. మరోవైపు.. సర్వేల సంగతి ప్రస్తావిస్తే.. 2019 ఎన్నికల వేళ సైతం వైసీపీ ఓడి పోతుందనే ప్రచారం జరిగిందని.. ఇప్పుడు కూడా కొన్ని సర్వేల్లో అలాంటిదే జరుగుతోందని తేలిగ్గా  కొట్టిపారేస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాబో యేది వైసీపీ సర్కారేనని అంటున్నారు.

       ఇక, టీడీపీ-జనసేన కూటమి.. మాదే అధికారమని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే రెండు పార్టీలూ పొత్తులో ఉండగా.. త్వరలోనే బీజేపీ కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అంతే కాదు.. ఎలక్షన్ల నాటికి సీపీఐ, సీపీఎం కూడా తమతో జట్టు కడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తు న్నారు. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదని.. విజయం తథ్యమని అంటున్నారు. ఈ క్రమంలోనే 2019లో వైసీపీ విజయంలో కీలకపాత్ర పోషించిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల్ని గుర్తు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ఓడిపోవడం తథ్యమని ఇటీవలె అభిప్రాయ పడ్డారు పీకే. సంక్షేమ పథకాలు అందించినంత మాత్రాన గెలుపు సాధ్యం కాదని చెప్పుకొ చ్చారా యన. ఈ వ్యాఖ్యల్నే ఇప్పుడు టీడీపీ-జనసేన కూటమి హైలెట్ చేస్తోంది. అయితే.. పీకే వ్యాఖ్యల్ని కొట్టి పారేస్తోంది అధికార వైసీపీ. సంక్షేమ పథకాలు నమ్ముకుంటే కష్టమని పీకే చెప్పిన మాటల్ని గుర్తు చేసిన వైసీపీ నేతలు.. అవే పథకాలను టీడీపీ-జనసేన కూడా అమలు చేస్తామంటున్న విషయాన్ని ప్రస్తావిస్తు న్నారు. మరి.. వాళ్ల విషయం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి.. వైసీపీ నమ్మకం ఫలిస్తుందా ? టీడీపీ-జనసేన వ్యూహాలు వర్కవు టవుతాయా ? రాబోయే ఎన్నికల్లో గెలిచేదెవరు అంటే ప్రస్తుతానికైతే సస్పెన్సేనని చెప్పాలి.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్