భారతీయ వాయుసేన అధికారి భార్యపై మాజీ సహ విద్యార్థి అఘాయిత్యం..బలవంతంగా మతమార్పిడి

భారతీయ వాయుసేన అధికారి భార్యపై మాజీ సహ విద్యార్థి అఘాయిత్యానికి పాల్పడడం.. తర్వాత వీడియో చిత్రీకరించి ఆమెను బ్లాక్‌ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడం.. తర్వాత వీడియో బయటకు రావడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. మతం మార్చుకోవాలని కూడా ఆమెపై ఒత్తిడి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడు అయాజ్‌ తాజ్‌ మదారే కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. గత ఏడాది ఫిబ్రవరి 8న ఓ హోటల్‌లో 24 ఏళ్ల మహిళ డ్రింక్‌లో మత్తు మందు కలిపాడు నిందితుడు అయాజ్‌. తనకు స్పృహ వచ్చి చూసేసరికి .. ఆమె అభ్యంతరకర వీడియో, ఫోటోలను చిత్రీకరించాడు. వాటిని భర్తకు పంపుతానని, సోషల్‌ మీడియాలో వైరల్ చేస్తానని బ్లాక్‌ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి తనను లైంగికంగా వేధించాడని, రూ.4 లక్షలు తీసుకున్నాడని బాధితురాలు వాపోయింది.

ఈ కేసులో అయాజ్‌ సహా ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా.. మరో నిందితుడు మౌలానా పరారీలో ఉన్నాడు. బలవంతపు మత మార్పిడిలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మౌలానాను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు మధ్యప్రదేశ్‌కు ప్రత్యేక బృందాన్ని పంపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Latest Articles

మాస్ రాజా ప్లాన్ అదిరింది..

మాస్ మహారాజా రవితేజ హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా.. ఏమాత్రం గ్యాప్ లేకుండా.. వరుసగా సినిమాలు చేస్తుంటారు. ఇరుముడి అనే ఫీల్ గుడ్ మూవీతో రాబోతున్న మాస్ రాజా.. ఈసారి మాస్ అండ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్