ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించిన వర్మ

వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ బెయిల్‌ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. ముందస్తు బెయిల్‌ కోసం వర్మ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో సోషల్‌మీడియాలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, లోకేష్‌లపై పెట్టిన పోస్టులపై ఆంధ్రప్రదేశ్ లో పలు కేసులు నమోదు అయ్యాయి. వారిపై అనుచిత పోస్టులు పెట్టారంటూ కొందరు చేసిన ఫిర్యాదుతో మద్దిపాడు పోలీస్ స్టేషన్‌తో పాటు ఎనిమిది ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.

అయితే ఇటీవల తనపై నమోదయిన కేసులన్నీ క్వాష్ చేయాలని రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం వర్మపై చర్యలు తీసుకోవద్దని.. పోలీసుల నుంచి కేసుల వివరాలను కోరింది. అయితే ఈరోజుతో ఆ గడువు పూర్తి కావడంతో ముందస్తు బెయిల్ పిటీషన్‌పై కూడా నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

Latest Articles

ఎండ తీవ్రతకు ఏసీ గదుల్లో కూడా నిద్ర రావడం లేదు- వైద్యులు ఏం చెబుతున్నారు?

దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతోంది. జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవతుఉన్నారు ఎయిర్ కండిషనర్ గదుల్లో నిద్రపోయినా చాలా మందికి సరిగా నిద్రపట్టడం లేదు. రాత్రి మధ్యలో పలుమార్లు మేల్కొనడం, అధిక చెమటలు, ఉదయం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్