టీ కాంగ్రెస్ లో అదే గందరగోళం కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీలో సమన్వయం పెరగడం లేదు. అంది వచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్దల ఎంపిక విషయంలో అదే తేటతెల్లమైంది. దీంతో అధికార కాంగ్రెస్ మారాదా అనే అభిప్రాయం సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్ల గడువు ముగిసే రోజు వరకు ఎన్నో ట్విస్టులు మరెన్నో మలుపులు అన్నట్లుగా మారింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్ లకు అవకాశం కల్పించాలని మొదట అనుకున్నారు. కానిరాత్రి కి రాత్రే ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు తెరమీదకు వచ్చింది. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు యువతకు అవకాశం కల్పించాల్సిందే అని తేల్చిచెప్పడంతో బల్మూరికి టికెట్ కన్ఫ్మామ్ అయ్యింది. దీంతో అద్దంకి, మహేష్ గౌడ్ ల నుంచి ఎవరినో ఒకరిని తప్పించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎన్నో తర్జన బర్జనల అనంతరం మొదట మహేష్ గౌడ్ ను తప్పించాలనుకున్నారు. కాని బీసీలు ఇప్పటికే బీజేపీవైపు మల్లుతున్ననేపత్యంలో బీసీ అయిన మహేష్ గౌడ్ ను తప్పిస్తే..పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కి నష్టం తప్పదు. అందుకే ఎమ్మెల్సీ పక్కా అనుకున్న అద్దంకిని పక్కకు తప్పించాల్సి వచ్చింది.
అయితే కాంగ్రెస్ లో సర్దుబాట్ల వల్ల కొందరికి అవకాశాలు చివరి నిమిషంలో జారిపోవడాన్ని అర్దం చేసుకొవచ్చు. కాని అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియనే పార్టీ లో సరిగా జరగలేదనే అభిప్రాయం హస్తం నేతల్లోనే వ్యక్తమవుతోంది. అభ్యర్ధుల ఎంపిక ను చివరి నిమిషం వరకు తెల్చకుండా ఎందుకు నాన్చాల్సి వచ్చింది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్ ఇంకా కాంగ్రెస్ లో ఉంది. అలాంటప్పుడు టికెట్లు ఆశించిన నేతలతో పార్టీ పెద్దలు చర్చించి…అవకావశం దక్కని నేతలకు బుజ్జగిస్తే సరిపోయేది. అసెంబ్లీ ఎన్నికల్లో అదే చేసారు. టికెట్లు దక్కని నేతల రాజకీయ భవిష్యత్తుకు బరోసా ఇచ్చారు. దీంతో అసెంబ్లీ టికెట్ల పంపిణి సజావుగా జరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాని ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో… అభ్యర్ధులను చివరి నిమిషంలో మార్చడం వల్ల ఎంతో గందగోళం తలెత్తింది.


