టాక్సిక్.. అసలు ప్లాన్ ఏంటి..?

కేజీఎఫ్ హీరో యశ్ నటిస్తున్న క్రేజీ మూవీ టాక్సిక్. ఆగష్టు 26న వరల్డ్ వైడ్ గా టాక్సిక్ రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే.. ఈ పాన్ ఇండియా మూవీ మరింతగా జనాల్లోకి వెళ్లాలి.. ఓపెనింగ్స్ అదిరిపోవాలి అంటే.. ప్రమోషన్స్ గట్టిగా చేయాలి. అందుకనే అనుకుంటా.. టాక్సిక్ మేకర్స్ ఓ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ వీడియో సాంగ్ యూత్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది కానీ.. అందులో ఉన్న కంటెంట్ మాత్రం అసలు యశ్ ప్లాన్ ఏంటి..? టాక్సిక్ లో ఎలాంటి కంటెంట్ ఉండబోతుంది..? అనే ఆసక్తిని మరింతగా పెంచేసింది. ఇంతకీ.. యశ్ ప్లాన్ ఏంటి..?

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాల తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ మూవీ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి అసలు ఇందులో ఎలాంటి కంటెంట్ ఉండబోతుంది అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఈ భారీ పాన్ ఇండియా మూవీని లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కించారు. అయితే.. లేడీ డైరెక్టర్ అయినప్పటికీ.. అడల్డ్ కంటెంట్ తో గ్లింప్స్ రిలీజ్ చేయడం పై విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ తగ్గేదేలే అనేట్టుగా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తున్నారు.

లేటెస్ట్ గా తబాహి వీడియో సాంగ్ విడుదల చేశారు. రెగ్యులర్ లిరికల్ సాంగ్ తరహాలో కాకుండా ఒరిజనల్ విజువల్స్ తో విడుదల చేశారు. యశ్‌, కియారా అద్వానీ రొమాన్స్ ఓ రేంజ్ లో ఉంది. ఈ సాంగ్ లో యశ్, కియారా రొమాన్స్.. ఆ కెమిస్ట్రీ చాలా ఘాటుగా ఉంది. యూట్యూబ్లో రిలీజ్ చేసిన ఈ సాంగ్లోనే ఇంత చూపిస్తే.. ఇక సిల్వర్ స్క్రీన్ పై ఏ రేంజ్లో ఉంటుందో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈవిధంగా టాక్సిక్ ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే.. అడల్ట్ కంటెంట్ ఎక్కువుగా కనిపిస్తుంది. ఈ కంటెంట్తో ఫ్యామిలీ ఆడియన్స్ ని దూరం చేసుకుంటే ఎలా అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

టీజర్ నుంచి ఇప్పటి వరుకు రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషన్ లో రొమాన్స్ హైలైట్ చేస్తూ వచ్చారు. ఈ కంటెంట్ చూసిన తర్వాత యశ్ ప్లాన్ ఏంటి..? ఈ సినిమాలో ఏం చూపించబోతున్నారు..? నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా లాంటి గ్లామర్ గాళ్స్ ను ఎలా చూపించబోతున్నారు..? అనేది ఆసక్తిగా మారింది. ఈ అడల్ట్ కంటెంట్ ప్రమోషన్స్ వలన ఎంత ప్లస్ అనుకుంటున్నారో.. బలమైన కథ, కథనం లేకపోతే.. ఎంత అడల్డ్ కంటెట్ ఉన్నా ఉపయోగం ఉండదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి.. టాక్సిక్ కథ ఏంటో.. యశ్ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో తెలియాలంటే.. ఆగష్టు 26 వరుకు వెయిట్ చేయాల్సిందే.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్