క్రిస్టియన్ అని… నాస్తికుడనని ఆరోపణలు చేస్తున్నవారికి ఇదే నా సమాధానం- TTD ఈవో

స్వతంత్ర వెబ్ డెస్క్: తిరుపతిలో జరిగిన మూడు తరాల మనిషి పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న టీటీడీ(TTD) చైర్మన్  తనపై  సోషల్ మీడియాలో(Social Media) దుష్ప్రచారం చేసేవారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  విమర్శలకు భయపడేవాడిని కాదని, 17 సంవత్సరాల క్రితమే టీటీడీ చైర్మన్ అయిన వ్యక్తిని అని ఆయన అన్నారు. శ్రీవారి దయతో 30 వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించానని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా.. తిరుమల ఆలయ నాలుగుమాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగకూడదనే నిర్ణయం తీసుకుంది నేనే అని ఆయన వ్యాఖ్యానించారు.

అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సవాలు చేసిందీ నేనే అని ఆయన వెల్లడించారు. నా మీద క్రిస్టియన్ అని నాస్తికుడనని ఆరోపణలు చేస్తున్న వారికి ఇదే నా సమాధానమన్నారు భూమన కరుణాకర్‌ రెడ్డి(Bhumana karunakar reddy). దళితవాడలకు శ్రీవెంకటేశ్వర స్వామిని తీసుకుని వెళ్ళి కళ్యాణం చేయించానని వివరించారు.  ఆరోపణలకు భయపడి మంచి పనులు చేయడం ఆపే వాడిని కాదని, పోరాటాల నుండి పైకి వచ్చిన వాడిని ఇలాంటి వాటికి భయపడనని భూమన కరుణాకర్‌ రెడ్డి స్పష్టం చేశారు.

 

Latest Articles

కాంగ్రెస్‌లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్