గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఇచ్చిన హామీని నెరవేర్చాలి – కేటీఆర్

రాష్ట్రంలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేవలం ఐదు లక్షలు నష్టపరిహారం ప్రకటించడం అన్యాయం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 25 లక్షలు నష్టపరిహారం ప్రకటించాల‌ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. గతంలో PCC అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డినే వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు 25 లక్షలు పరిహారం అందిస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రూ. 25 లక్షలు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే అంతకన్నా మోసం మరొకటి ఉండదు అని కేటీఆర్ చెప్పారు.

అదే విధంగా, వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన, డ్యామేజ్ అయిన వారికి 5 లక్షల వరకు సాయం చేస్తామన్న హామీని కూడా నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వం అసమర్థత, చేతగానితనం, ముందస్తు ప్రణాళిక లేకపోవడం కారణంగానే ప్రాణనష్టం జరిగిందని ఆరోపించారు. ఇకనైనా ప్రజల ప్రాణాలు రక్షించేందుకు చర్యలు చేపట్టి వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు భరోసా కల్పించాని కేటీఆర్ సూచించారు.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్