ప్రారంభమైన అరగంటకే మాల్‌ను లూటీ చేశారు పాకిస్తానీలు. ఒకరు ఇద్దరు కాదు.. లక్ష మంది వరకూ పోటెత్తి అందికాడికి అందుకుని మాల్‌ను ధ్వంసం చేశారు. ఈ వింత ఘటన కరాచీలోని డ్రీమ్ బజార్‌లో జరిగింది.
విదేశాల్లో ఉంటున్న డ్రీమ్ బజార్ యజమాని ప్రారంభం సందర్భంగా బంపర్ ఆఫర్ ఇచ్చారు. 50 రూపాయల కంటే తక్కువ ధరలకే అంటూ విక్రయాలపై సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం చేశారు. దీంతో మాల్ ప్రారంభంకాగానే పోటెత్తిన జనం.. లోపలకు చొచ్చుకుని పోయి ఎవరికి అందికనకాడికి వాళ్లు వస్తువులను ఎత్తుకెళ్లి మాల్‌ను లూటీ చేశారు. ఇక ఒక్కసారిగా జనం ఎగబడటంతో అక్కడి సెక్యూరిటీ, పోలీసులు చేతులెత్తాశారు.