ఏపీలో వరద పరిస్థితిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరా తీశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ముంపు గ్రామాల్లో బీజేపీ శ్రేణులు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తనతో స్వయంగా మాట్లాడి ఆరా తీశారన్నారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని నడ్డా సూచించారని చెప్పారు. బీజేపీ శ్రేణులు సేవా కార్యక్రమాలు ఉధృతం చేయాలన్నారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు బీజేపీ శ్రేణులు సహకారం అందించాలని పురంధేశ్వరి విజ్ఞప్తి చేసారు.