తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కుంపటి.. పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత

దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజురోజుకీ ఎండల తీవ్రత మరింత పెరుగుతోంది. ఉత్తర భారతం నుంచి తెలుగు రాష్ట్రాల వరకు భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్‌..ఛత్తీస్‌గఢ్‌, ఏపీలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం వడగాల్పులతో అల్లాడిపోతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

నైరుతి రుతుపవనాలు విస్తరించడానికి మరింత సమయం పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరో వారం రోజులు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు అత్యధికంగ నమోదవుతున్నాయని తెలిపింది. దీంతో ప్రజలు అప్రత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి.తీవ్ర వడగాలులకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. పగలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి… ఇక రాత్రయినా ఆ వేడి తగ్గకపోవడంతో నిద్రపట్టక కష్టాలు పడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలో చాలా చోట్ల 47 డిగ్రీలకు పైగా నమోదవుతోంది. ఏపీలో 12 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ పిడుగురాళ్లలో అత్యధికంగా 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది

ఇక తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వేడికి జనం అల్లాడిపోతున్నారు. బయటకు వచ్చినా.. ఇంట్లో ఉన్నా అదే పరిస్థితి ఉంది. తెలంగాణలోని పెద్దపల్లిలో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్‌ జిల్లా దిల్‌వార్‌పూర్‌లో 46.5 డిగ్రీలు… కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌లో 46.3 డిగ్రీలు నమోదైంది.

Latest Articles

కుల వ్యవస్థను నిర్మూలించేందుకే ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు నిర్మిస్తున్నాం- రేవంత్ రెడ్డి

విద్యారంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతామని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయన్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్