బాసర ఆలయంలో జరిగిన చోరీని జిల్లా పోలీసులు ఛేదించారు. సాంకేతికత సాయంతో పది రోజుల్లోనే దొంగలను గుర్తించారు. 6 ప్రత్యేక బృందాలతో విస్తృత గాలింపు చేపట్టిన పోలీసులు.. ఇద్దరు అంతర్ జిల్లా దొంగలతో పాటు మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 1.220 కిలోల వెండి కిరీటం, 260 గ్రాముల వెండి పట్టి, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పల్లపు ఏడుకొండలు, గైని రామకృష్ణ, కొడమ ఆనంద్ గా గుర్తించారు. నిందితులు పాత నేరస్తులుగా గుర్తించారు. రైల్వే సౌకర్యం గల ఆలయాలలో చోరీ వీరి ప్రత్యేకత. కిరీటం అమ్మడం కోసం రైలులో నాందేడ్‌కు వెళ్తుండగా బాసర వద్ద నిందతులను అదుపులోకి తీసుకున్నారు. చోరీ ని వేగంగా ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.
బాసర ఆలయంలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు
0
109
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


