సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంత్రి జూపల్లి మాజీ మంత్రి హరీశ్‌రావుకు సవాల్ విసిరారు. ప్రెస్‌క్లబ్‌కు హరీష్‌రావు రావాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్‌ఎస్ పార్టీ సిగ్గు తప్పిన పార్టీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ” నా సవాల్‌కు కట్టుబడి ఉన్నా. నాది తప్పు అని తేలితే రాజీనామా చేస్తా. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుకు 3 కుర్చీలు వేశాం. బీఆర్‌ఎస్ అప్పులపై చర్చకు సిద్ధం. నేను కేసీఆర్, హరీష్, కేటీఆర్‌కు లేఖ రాశా. రూ.4.17 లక్షల కోట్ల అప్పు అంటూ హరీష్‌రావు నాకు రిటర్న్ లెటర్ పంపారు. రూ.8.21 లక్షల కోట్ల అప్పులని నేను లేఖలో చెప్పా. సొల్లు కథలతో హరీష్‌రావు నాకు తిరిగి లేఖ పంపారు. నేను ఎప్పుడెప్పుడు ఎంత అప్పు చేశారో లేఖలో పేర్కొన్నా. ఆ విషయంపై హరీష్‌రావు ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు” అని జూపల్లి అన్నారు.
సవాళ్ల పర్వం.. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంత్రి జూపల్లి
0
65
Previous article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


