విపత్కర పరిస్థితులను రాజకీయం చేయడం సరికాదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఖమ్మంలో తీవ్ర ప్రభావం ఉండడం వల్ల మంత్రి తుమ్మల, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అక్కడే ఉన్నారన్నారు. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ రాజకీయం చేయడం సరికాదన్నారు. హరీష్ రావు, కేటీఆర్ తమ బుద్ధి ఇప్పటికైనా మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం యాంత్రాంగంతో పాటు ప్రతిపక్ష నేతలు కూడా పాల్గొనాలన్నారు. హరీష్‌రావు, కేటీఆర్ ముందుకు రావాలని.. ప్రజలపై అభిమానం, ప్రేమ ఉంటే అధికారులతో కలిసి సహాయం చేయాలని మంత్రి సూచించారు.