ఓ వైపు ఓ క్రేజీ మూవీని డైరెక్షన్ చేస్తూనే.. మరో వైపు డిఫరెంట్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రెస్టేజియస్ మూవీని డైరెక్ట్ చేస్తూ.. మరో మూవీని ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు.. ఇంత టెన్షన్ అవసరమా అంటే.. తను ఎందుకు ఆ సినిమాను నిర్మిస్తున్నారో ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టారు. అంతే కాదండోయ్.. ప్రస్తుతం క్రేజీ మూవీ గురించి అప్ డేట్ ఇవ్వలేదు కానీ.. తన మైండ్లో ఉన్న క్రేజీ స్టార్ తో భారీ సినిమా గురించి హింట్ ఇచ్చారు. ఇంతకీ.. నాగ్ అశ్విన్ ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ గురించి ఏం చెప్పారు..? ఆయన మైండ్లో ఉన్న క్రేజీ మూవీ ఎవరితో..?
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ సింగ్ గీతం. ఈ మూవీని నాగ్ అశ్విన్ నిర్మిస్తుండడం విశేషం. ఇటీవల ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. డిఫరెంట్ గా ఉన్న ఈ మూవీ టీజర్ సినిమా పై మరింత బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. లేటెస్ట్ గా హలో బాసు అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో నటుడు వంశీ భారీ హ్యాంగోవర్‌తో నిద్రలేచి, గొంతు మారడంతో మాట్లాడే బదులు పాడుతూ వింతగా ప్రవర్తిస్తాడు. ఊరిలోని వారందరికీ ఇదే వింత సమస్య ఉందని ఒక చిన్న పిల్లాడు వచ్చి చెప్పడం ఈ పాటలో హైలైట్ అని చెప్పచ్చు.
అయితే.. ఎంతో ఫన్‌గా సాగే ఈ స్పెషల్ సాంగ్ కేవలం ప్రమోషన్స్ కోసమే వాడామని, సినిమాలో ఈ పాట ఉండదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. సింగీతం గారి పై ఉన్న గౌరవంతోనే ఈ చిత్రాన్ని నిర్మించానని తెలిపారు. నిజానికి ఈ డిఫరెంట్ కాన్సెప్ట్‌ను ఆయన పుష్పక విమానం కంటే ముందు నుంచే అనుకున్నారని.. అప్పట్లో కమల్ హాసన్‌కు కూడా ఈ కథను వినిపించారని, కానీ అప్పుడు అది కుదరలేదని నాగ్ అశ్విన్ అసలు విషయం బయటపెట్టారు. జూన్ 11న ఈ సింగ్ గీతం మూవీని విడుదల చేయనున్నారు.
ప్రస్తుతం నాగ్ అశ్విన్ కల్కి 2 మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రేజీ మూవీ గురించి అప్ డేట్ అడిగితే ఏమీ చెప్పలేదు కానీ.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో తప్పకుండా సినిమా చేస్తానని చెప్పారు. ఓ వైపు కల్కి-2 సినిమాతో బిజీగా ఉన్నప్పటికీ, మరో వైపు సింగీతం శ్రీనివాసరావు సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే.. కేవలం ఆయనతో కలిసి వర్క్ చేయడం కోసమే నిర్మాతగా మారానన్నాడు నాగ్ అశ్విన్.


