ఎయిర్‌షోలో గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. ఆ తర్వాత

అమెరికాలోని పశ్చిమ ఐడాహో రాష్ట్రంలోని మౌంటైన్‌ హోమ్‌ ఎయిర్‌ బేస్‌( Mountain Home Air Force Base) లో ఆదివారం జరిగిన ఎయిర్ షో సందర్భంగా రెండు అమెరికా నౌకాదళ యుద్ధ విమానాలు గాల్లో ఢీకొన్నాయి. అయితే, ఆ రెండు విమానాల్లో ఉన్న నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో పాల్గొన్నవి అమెరికా నేవీకి చెందిన రెండు EA-18G Growler యుద్ధ విమానాలు. ఇవి ఎలక్ట్రానిక్ ఎటాక్‌ స్క్వాడ్రన్‌ 129( Electronic Attack Squadron) 129 కు చెందినవి. ఈ స్క్వాడ్రన్ విడ్‌ బీ ఐలాండ్‌ (Whidbey Island)లో స్థాపించబడి ఉంది.

అమెరికా పసిఫిక్ ఫ్లీట్ నేవల్ ఎయిర్ ఫోర్సెస్ ప్రతినిధి కమాండర్ అమెలియా ఉమాయమ్‌(Amelia Umayam) తెలిపిన వివరాల ప్రకారం, ఎయిర్ షోలో గగన విన్యాసాలు ప్రదర్శిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న వెంటనే నలుగురు సిబ్బంది విమానాల నుంచి బయటకు దూకి పారాచూట్ల సహాయంతో భూమిపై సురక్షితంగా దిగారు.

సిబ్బంది ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడా ఉందని ఎయిర్‌ బేస్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని Silver Wings of Idaho కు చెందిన మార్కెటింగ్ డైరెక్టర్ Kim Sykes తెలిపారు.

ప్రమాదం అనంతరం ఎయిర్ బేస్‌ను వెంటనే లాక్‌డౌన్ చేసి, మిగతా ఎయిర్ షో కార్యక్రమాలను రద్దు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో నాలుగు పారాచూట్లు గాల్లో తెరుచుకోవడం, విమానాలు నేలపై పడిపడి భారీ అగ్నిగోళాలుగా పేలిపోవడం కనిపించింది.

EA-18G Growler అనేది F/A-18 Super Hornet కు చెందిన ప్రత్యేక ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వేరియంట్. ఈ విమానాలు శత్రు రాడార్ , కమ్యూనికేషన్ వ్యవస్థలను అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

ఈ ఘటనను చిత్రీకరించిన షేన్‌ ఓగ్డెన్‌( Shane Ogden) మాట్లాడుతూ, రెండు విమానాలు ఒకదానికొకటి తాకి కలిసి తిరుగుతూ కిందకు పడిపోయాయని చెప్పారు. పైలట్లు సమయానికి బయటకు దూకడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు.

విమాన భద్రత నిపుణుడు జెఫ్‌( Jeff Guzzetti) మాట్లాడుతూ, సాధారణంగా గాల్లో ఢీకొన్నప్పుడు పైలట్లకు బయటకు దూకే అవకాశం ఉండదని, కానీ ఈ ఘటనలో విమానాలు కొంతసేపు కలిసి ఉండటంతో సిబ్బందికి బయటకు వచ్చే అవకాశం లభించిందన్నారు.

మరో నిపుణుడు జాన్‌( John Cox) ప్రకారం, ఎయిర్ షోలో విన్యాసాలు చేయడం అత్యంత కఠినమైన పని అని, చిన్న పొరపాటు కూడా ప్రమాదానికి దారితీస్తుందని చెప్పారు.

ఈ ఏడాది జరిగిన “Gunfighter Skies” ఎయిర్ షో 2018 తర్వాత మొదటిసారి నిర్వహించబడింది. 2003లో ఇదే ప్రాంతంలో జరిగిన మరో ప్రమాదంలో US Air Force Thunderbirds కు చెందిన విమానం కూలిపోయినా పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.

అమెరికాలో ప్రతి సంవత్సరం సుమారు 200 ఎయిర్ షోలు నిర్వహించబడుతుండగా, గత కొన్నేళ్లుగా భద్రతా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని John Cudahy తెలిపారు.

ప్రస్తుతం ఈ ప్రమాదంపై అమెరికా నేవీ దర్యాప్తు ప్రారంభించింది.

Latest Articles

12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారు- పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ యువత పట్ల గౌరవం ఉందని.. యువత బలిదానాలు తనను కదిలించాయన్నారు. 12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారని చెప్పారు. 1200...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్