ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినీ జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో మీనాక్షి సెంటిమెంట్ ఒకటి ఉంది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.. ఈ సెంటిమెంట్ తో మరో సక్సెస్ సాధించేందుకు ప్లాన్ రెడీ చేసాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ.. మీనాక్షి సెంటిమెంట్ ఏంటి..? నాగవంశీ ప్లాన్ ఏంటి..?
ఇచ్చట వాహనాలు నిలుపరాదు.. అనే మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన మీనాక్షి చౌదరి.. ఫస్ట్ మూవీతో గుడ్ పర్ ఫార్మర్ అనిపించుకుంది కానీ.. కమర్షియల్ సక్సెస్ మాత్రం రాలేదు. అయితే.. సక్సెస్ ని బట్టే ఆఫర్స్ ఇచ్చే ఇండస్ట్రీలో.. ఈ అమ్మడు లక్కీగా హిట్ 2లో ఛాన్స్ దక్కించుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో మీనాక్షి కెరీర్ ట్రాక్ లోకి వచ్చింది. ఆతర్వాత వరుసగా ఆఫర్స్ సొంతం చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలో నటించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో రూపొందిన గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన మీనాక్షికి మరింత క్రేజ్ పెరిగింది.
గుంటూరు కారం తర్వాత లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ, సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒకరాజు సినిమాల్లో నటించి సక్సెస్ సాధించడంతో మీనాక్షి క్రేజ్ నెక్ట్స్ లెవల్ కి వెళ్లింది. ఇక అసలు విషయానికి వస్తే.. మీనాక్షి నటించిన గుంటూరు కారం 2024 సంక్రాంతికి రిలీజై బ్లాక్ బస్టర్ అయ్యింది. 2025 సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. 2026లో అనగనగా ఒక రాజు బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇలా మీనాక్షి నటించిన సినిమాలు సంక్రాంతికి రిలీజ్ చేస్తే.. బ్లాక్ బస్టర్ అవ్వడంతో సెంటిమెంట్ గా మారింది.
ఇప్పుడు మీనాక్షి.. కార్తికి జంటగా నటిస్తుంది. ఈ మూవీని కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. స్టోరీ సెటప్ కూడా సంక్రాంతికి కరెక్ట్ గా సెట్ అవుతుండడం.. మీనాక్షి మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తే.. బ్లాక్ బస్టర్ అవుతుండడంతో… ఇలా ప్లాన్ చేస్తున్నారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. మరి.. మీనాక్షి సెంటిమెంట్ మళ్లీ నిజమై నాగవంశీకి మరో బ్లాక్ బస్టర్ అందిస్తుందేమో చూడాలి.


