బండి భగీరథ్‌ను అరెస్టు చేశామని.. సరెండర్ కాలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అప్పా జంక్షన్లో వాహనాల తనిఖీల్లో భగీరథ్ పోలీసులకు చిక్కాడని అన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం వెళ్లామని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రచారాల వల్ల అమ్మాయి కుటుంబం ఇబ్బందులు పడ్డారని వివరించారు.
కేటీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్.. కేటీఆర్ మనిషా.. రాజకీయం రాజకీయంగా చూడాలని అన్నారు. పోక్సో కేసులో బాధితుల వివరాలు బహిర్గతం చేయకూడదని వివరించారు. కేటీఆర్ మనిషిలా ప్రవర్తించడం లేదని ఫైరయ్యారు. మైనర్ అమ్మాయిని అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు.


