పుల్వామా దాడుల వెనుక కీలక సూత్రధారిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హంజా బుర్హాన్ హతమయ్యాడు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో హంజా బుర్హాన్ హతమైనట్టు తెలుస్తోంది.
గుర్తు తెలియని వ్యక్తులు టెర్రరిస్ట్ హంజా బుర్హాన్‌పై మెరుపు దాడికి దిగారు. కాల్పులు జరిపిన దుండగులు ఉగ్రవాదిని టార్గెట్ చేశారు.
ఈ కాల్పుల్లో హంజా బుర్హాన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
పుల్వామా దాడుల వెనుక మాస్టర్‌మైండ్‌గా హంజా బుర్హాన్‌పై నిఘా సంస్థలు నిఘా పెట్టాయి. ఉగ్రవాది కదలికలు, దాగి ఉన్న ప్రాంతాలపై గత కొంతకాలంగా పలు ఇంటెలిజెన్స్ సంస్థలు సమాచారం సేకరిస్తున్నాయి.


