తెలంగాణలోని కార్మికులకు కనీస వేతనంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనీస వేతనం పెంచేందుకు నిర్ణయించింది. మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా అమలుకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. సరైన వేతనాలు, కార్మికుల సంతృప్తి కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పరిశ్రమలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.
కార్మికుల కనీస వేతనాలపై మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కార్మికులను 4 విభాగాలుగా చేసి కనీస వేతనాలు నిర్ణయించామని చెప్పారు. జోన్ 1లో మున్సిపల్ కార్పొరేషన్‌లోని పరిశ్రమల కార్మికులు, జోన్ 2లో మున్సిపాలిటీలోని పరిశ్రమల కార్మికులు, జోన్3లో గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమల కార్మికులు వస్తారని తెలిపారు. జోన్1లో కార్మికులకు కనీస వేతనం కింద రూ,16వేలకు పెంచామని చెప్పారు. కార్మికుల సంక్షేమం, కనీస వేతనాలపై గత సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కేసీఆర్ నిర్లక్ష్యంతో కార్మికులు పదేళ్లు నష్టపోయారని అన్నారు.


