సీఎం జగన్‌పై దాడి కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

    సీఎం వైఎస్‌ జగన్‎పై రాయి దాడి కేసులో దర్యాప్తు స్పీడప్‌ అయింది. 20 స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. నింది తుల కోసం జల్లెడ పడుతున్నారు. దాడికి గల కారణాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 15 రోజులుగా గంగానమ్మ గుడి దగ్గర సెల్‌టవర్‌ నుంచి వెళ్లిన కాల్స్‌ను పరిశీలి స్తున్నారు. దాడి జరిగిన ప్రాంతంలో ఇన్‌కమింగ్, ఔట్‌గౌయింగ్ కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. ఒకే నెంబర్ నుంచి ఎక్కువ కాల్స్ వెళ్లినా, వచ్చినా వాటిపై ఆరా తీస్తున్నారు. ఆరు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన క్లూస్ టీమ్స్‌ దర్యాప్తు కొనసాగి స్తోంది. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఏర్పాటైన సిట్‌ ఆధారాలు సేకరిస్తోంది. ప్రత్యక్ష సాక్షుల నుంచి స్టేట్‌మెంట్స్‌ రికార్డు చేస్తున్నారు. కేసును దర్యాప్తును డీజీపీ కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంత దూరం నుంచి జగన్‌కు తగిలేలా రాయి ఎలా విసిరారనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది.

   సీఎం జగన్‌ వాహనానికి ఉన్న సీసీ కెమెరాల పుటేజ్‎తో పాటు పోలీస్ వాహనాలకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‎ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాహనాలకు కెమెరాలు ఉన్నప్పటికీ ఫోకస్ లైట్స్‎తో క్లియర్‎గా వీడియోలు కనిపించడం లేదు. గంగానమ్మ గుడి ఐసోలేషన్ లోకేషన్లో కాల్ డేటా డంప్, సాంకేతిక డేటా ఫిల్టల్ చేస్తున్నారు. ఈ కేస్ దర్యాప్తులో దాదాపు 20 టీమ్‎లు పని చేస్తున్నాయి. విజయవాడలో రౌడీ షీటర్లు, అసాంఘిక శక్తుల కార్యకలాపాలపైనా ఫోకస్‌ చేశారు. రౌడీ షీటర్లు ఏం చేస్తున్నారు..? ఎక్కడున్నా రనేదానిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు.. దాడికి సంబంధించి నిందితుల వివరాల చెప్పిన వారికి ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు నగదు బహుమతిని ప్రకటించారు. నిందితుల గురించి ఏదైనా సమాచారం ఉన్నా, తెలిసినా తమకు తెలపాలని పోలీసులు కోరారు. దాడికి సంబంధించి కచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి 2 లక్షల రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు పోలీసులు తెలిపారు.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్