16వ రోజుకు చేరుకున్న సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సు యాత్ర

   వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాయి దాడి ఘటన అనంతరం నిన్న తిరిగి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించిన జగన్.. ఎన్టీఆర్ జిల్లా నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. ఇవాళ 16వ రోజు జగన్‌ బస్సు యాత్రను కొనసాగించనున్నారు. యాత్రలో భాగంగా బస్సు నుంచి కిందకు దిగి ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటు న్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా జగన్ యాత్ర కొనసాగుతోంది. ప్రజలు కూడా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు.

   వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16వ రోజు కొనసాగనుంది. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్‌ సోమవారం రాత్రి బస చేసిన నారాయణపురం దగ్గర నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకుంటారు. ఉండి శివారులో సీఎం జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి భీమవరం బైపాస్‌ రోడ్‌ గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్‌ కాలేజ్‌ వద్ద సాయంత్రం 3.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొం టారు. సభ అనంతరం పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్‌ మీదుగా ఈతకోట శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్