భారత్ ఆగ్రరాజ్యంగా అవతరించి అభివృద్ధిశలో సాగుతుంటే పాక్ ఆర్థికంగా అడ్డుక్కునే పరిస్థితికి దిగజారిందని జమియత్ ఉలేమాఎఇస్లాం (ఎఫ్) అధ్యక్షుడు మౌలానా ఫజూర్ రెహ్మాన్ పాక్ పార్లమెంట్ లో ప్రకటించా రు. మంగళవారం ఆయన పార్లమెంట్ లో ఈ వ్యాఖ్యలు చేస్తూ భారత్ పై పొగడ్తల వర్షం కురిపిం చాడు. మరోవైపు పాక్ రాజకీయ విలువలను తూ లనాడారు. వరల్డ్ బ్యాంక్ తో పాటు ఇతరదేశాల దగ్గర మనం ఆర్థికంగా ఆదుకోవాలని అడుక్కునే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ పరిస్థితికి ఎవరు బాధ్యులని మౌలానా ప్రశ్నించారు. పాకి స్థాన్లోని రాజకీయ నాయకులు భారత్ను ఎంత వ్యతిరేకించినా, భారత్ అభివృద్ధిలో మనకంటే చాలా ముందుకెళ్లిందన్న విషయాన్ని ఎవ్వరైనా అంగీకరించాల్సిందేనన్నారు. పాక్ లోని ప్రజా ప్రతినిధులు కీలుబొమ్మలుగా మారారని ఆయన మండి పడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఇంకెంతకాలం అమ్ముకుంటారని అగ్రహం వ్యక్తం చేశారు. బయటి శక్తుల ప్రమేయంతోనే పాక్ కు ఈ దుస్థితి దాపురించిందని తెలిపారు. కాగా తెహ్రీక్ఇఇన్సా ఫ్ (పీటీఐ) బహిరంగ సభలను నిర్వహించడానికి అనుమతించాలని మౌలానా రెహ్మాన్ వాదించారు.
అగ్రరాజ్యంగా భారత్ … దీన స్థితిలో పాక్
0
270
Previous article
Next article
Latest Articles
ఎర్రబస్సులు కాదు.. ఎయిర్‌బస్సులు తిరిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర ఎదిగింది- రామ్మోహన్ నాయుడు
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్రకు సింహద్వారమని విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉత్తరద్వారంలా భోగాపురం తెరుచుకుందని అభిప్రాయపడ్డారు. ఎర్రబస్సులు కాదు.. ఎయిర్‌బస్సులు తిరిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర ఎదిగిందని కేంద్రమంత్రి అభివర్ణించారు....
- Advertisement -
- Advertisement -


