Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

ముస్లీంలపై మోడీ వ్యాఖ్యల్లో ఎత్తుగడలు ఏమిటి?

రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారసభలో ప్రధాని నరేంద్ర చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం రేపాయి. ప్రధాని హోదా లో ఉన్న వ్యక్తి ఒక సమూహాన్ని ఉద్దేశించి ఇలా మాట్లాడటం సమంజసమేనా అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై మేధావులు, ప్రజాస్వామ్యప్రియులు తీవ్రంగా మండిపడ్డారు. నరేంద్ర మోడీ హుందాతనం కోల్పోయార న్న విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తంమీద రాజకీయవర్గాల్లో నరేంద్ర మోడీ ఇమేజ్ దెబ్బతినే పరిస్థితులు వచ్చాయి.

  ముస్లిం సమాజంపై తాను చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడాన్ని నరేంద్ర మోడీ గమనించారు. చిలికి చిలికి గాలివాన అవుతుందన్న విషయం ఆయనకు అర్థమైంది. దీంతో ఈ దుమారానికి ఎండ్‌కార్డ్ వేయాలనుకున్నారు. నష్ట నివారణ చర్యలు చేపట్టారు. దీనికోసం పక్కా వ్యూహం పన్నారు. ఈ వ్యూహంలో భాగంగానే ముస్లిం సముదాయంపై తాను చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ వివరణ ఇచ్చారు. ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేయడం ఒక ఎత్తు అయితే సదరు వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇవ్వడం మరో ఎత్తు. ఇస్లాంకు అలాగే ముస్లింలకు తాను వ్యతి రేకం కాదని ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా వివరణ ఇచ్చారు. దశల వారీగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఒక జాతీయ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు.

భారతదేశంలో అతి పెద్ద అల్పసంఖ్యాకవర్గమైన ముస్లింలను వ్యతిరేకించడం భారతీయ జనతా పార్టీ విధానం కాద న్నారు. ఒక సమూహాన్ని వ్యతిరేకించడాన్ని కమలం పార్టీ ఎన్నడూ చేయదని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. అయితే బీజేపీ నాయకులను ముస్లిం వ్యతిరేకులు అంటూ కాంగ్రెస్ నాయకులు ఊరూవాడా ఏకం చేస్తూ చాలాకాలంగా ప్రచా రం చేస్తున్నారని మండిపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కాలం నుంచే కాంగ్రెస్ నాయకులు ఇలా తమపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఘాటు ఆరోపణలు చేశారు ప్రధాని మోడీ. ముస్లింల విషయంలో కాంగ్రెస్ పార్టీ రెండు అంచెల వ్యూహంతో వ్యవహరిస్తోందని మరో ఆరోపణ చేశారు నరేంద్ర మోడీ. ఒకవైపు బీజేపీ నాయకులు ముస్లిం వ్యతిరేకులని ప్రచారం చేయడం మరోవైపు ముస్లింలపై కపట ప్రేమను ప్రదర్శించడం కాంగ్రెస్ పార్టీ వ్యూహమని ఎదురుదాడి చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే గతంతో పోలిస్తే, ప్రస్తుతం ముస్లిం సమాజం ఎంతో చైతన్యవంతమైందన్నారు ఆయన. ఈ సందర్భంగా ట్రిపుల్ తలాక్‌ను తమ ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని నరేంద్ర మోడీ ప్రస్తావించారు. ట్రిపుల్ తలాక్‌ రద్దు సందర్భంగా తన చిత్తశుద్ధిని ముస్లిం మహిళలు అర్థం చేసుకున్నా రని మోడీ పేర్కొన్నారు. ఆయుష్మాన్‌ కార్డులు ఇచ్చినప్పుడు అలాగే కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకువచ్చిన ప్పుడు కూడా తన నిజాయితీని దేశవ్యాప్తంగా ముస్లిం లు అర్థం చేసుకున్నారని నరేంద్ర మోడీ వెల్లడించారు. ప్రధానిగా తాను ఎవరిపట్ల వివక్ష చూపడం లేదన్న విషయాన్ని ముస్లిం సమాజం అర్థం చేసుకుందన్నారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి మింగుడుపడటం లేదన్నారు. ఈ కారణంతోనే తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తోందని హస్తం పార్టీపై మండిపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ.

    ఇక్కడ మరో అంశముంది. దేశవ్యాప్తంగా ముస్లిం మైనారిటీలు మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీకి గట్టి మద్దతుదారులుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీనపడిన చోట తృణమూల్, సమాజ్‌వాదీ పార్టీ వంటి ప్రాంతీయ పార్టీలకు అండగా నిలుస్తున్నారు. అయితే ముస్లిం సమాజానికి వివరణ ఇవ్వడం ద్వారా మెజారిటీ ముస్లింలను కాంగ్రెస్‌ శిబిరానికి దూరం చేయాలన్నదే ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహంగా కనిపిస్తోంది. అంతిమంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓట్‌బ్యాంక్‌ను చీల్చడమే నరేంద్ర మోడీ వ్యూహంలో భాగమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ ఓట్‌బ్యాంక్ ఎంతగా చీలిపోతే ఇండియా కూటమి విజయావకాశాలు అంతగా తగ్గుతాయన్నది నరేంద్ర మోడీ ధీమా. అంతిమంగా ఈ పరిణామాలన్నీ బీజేపీకి ప్లస్ పాయింట్లు అవుతాయన్నది మోడీ ఆలోచనలా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు జరిగిన మూడు విడతల పోలింగ్‌లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి నిరాశాజనకంగా ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో కమలం పార్టీలో గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని బీజేపీ అగ్రనాయకత్వంపై ఉత్తరప్రదేశ్‌ ఠాకూర్లు ఆగ్రహంతో ఉన్నట్లు లక్నో రాజకీయవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ విజయావకాశాలపై అనుమానాలు తలెత్తుతు న్నాయి.

దీనికితోడు కర్ణాటకలో ప్రజ్వల్ రేవణ్ణ ఎపిసోడ్ భారతీయ జనతా పార్టీ కూటమికి మైనస్ పాయింట్‌గా మారిందన్న అంచనాలున్నాయి. కర్ణాటకలో దేవెగౌడ మనవడు, జేడీ ఎస్‌ యువ నేత ప్రజ్వల్ రేవణ్ణ వివాదం కమలం పార్టీకి చుట్టుకుందని బెంగళూరు పొలిటికల్ సర్కిల్స్‌ టాక్. కర్ణాటకలో జేడీ ఎస్ తో ఇటీవల బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణ ఎపిసోడ్ తాజాగా కర్ణాటకలో జరిగిన మూడో విడత పోలింగ్‌లో బీజేపీ గెలుపు అవకాశాలను దెబ్బతీసిందన్న వార్తలు వినవస్తున్నాయి. మొత్తంమీద భవిష్యత్తులో జరగబోయే నాలుగు విడతల పోలింగ్‌ లో ముస్లింలను దూరం చేసుకోకూడద న్నదే ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహంగా కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్