ప్రముఖ సీనియర్ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నిన్న ఎన్నికయ్యారు. ఎస్‌సీబీఏ అధ్యక్ష పదవికి సిబల్ మే 8న అభ్యర్థిత్వాన్ని ప్రకటించగా నిన్న ఎన్నికలు జరిగాయి. తన ప్రత్యర్థి ప్రదీప్ రాయ్‌ని ఆయన ఓడించారు. కపిల్ సిబల్‌కి ఒక వెయ్యి 66 ఓట్లు పడగా ప్రదీప్ రాయ్‌కి 689 ఓట్లు పడ్డాయి. ఇప్పటివరకు ఎస్‌సీబీఏ అధ్యక్షుడిగా కొనసాగిన ఆదీశ్ అగర్వాల్‌కు 296 ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో కపిల్ సిబల్ విజేతగా నిలిచారు.కపిల్ సిబల్ హార్వర్డ్‌లా స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ చదివారు. 1983లో సీనియర్ న్యాయవాదిగా సేవలు అందించారు. 1989 నుంఇ 90 సమయంలో భారత అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో 1995 నుంచి 2002 మధ్య కాలంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మూడు సార్లు పనిచేశారు. కేంద్రమంత్రిగానూ ఆయన పనిచేశారు.
బార్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో కపిల్ సిబల్ గెలుపు
0
231
Previous article
Latest Articles
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు- చంద్రబాబు
చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
వాతావరణ సమతుల్యం దెబ్బతిందని చంద్రబాబు అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని...
- Advertisement -
- Advertisement -


