హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో మబ్బులు కమ్మేశాయి. ఉదయం నుంచి పొడి వాతావరణం ఉండగా మధ్యాహ్నానికి వాతావరణం చల్లగా మారిం ది. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్, పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. నగరంలోని మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్ ప్రాంతాలలో చిరు జల్లులు కురుస్తున్నాయి. బషీర్‌బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి ప్రాంతా ల్లోనూ వాన కురుస్తోంది. నైరుతీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మే 23వరకు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వివరించింది. అల్పపీడనం మే 24నాటికి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణశాఖ.
హైదరాబాద్ నగరాన్ని కమ్మేసిన మబ్బులు
0
198
Previous article
Next article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


