నేడు తెలంగాణలో రెండో విడత రైతు రుణమాఫీ

రైతులకు రెండో విడత రుణమాఫీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీ ప్రాంగణం నుంచి సీఎం రేవంత్‌ దీన్ని ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హాజరకానున్నారు. ఇటీవల లక్ష లోపు రుణం ఉన్న వారికి మాఫీ చేశారు. రెండో విడతలో లక్షన్నర రుణం మాఫీ కానుంది. దీంతో ఆరు లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. రెండో విడత కోసం ప్రభుత్వానికి 7వేల కోట్లు అవసరమని అధికారులు తెలిపారు. రెండో విడత రుణమాఫీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు, మూడో విడత రుణమాఫీ ఆగస్ట్ 14వ తేదీ తర్వాత జరగనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్ట్ 2 నుంచి 14వ తేదీ వరకు విదేశీ పర్యటనలో ఉండనున్నారు. ఆయన తిరిగి రాష్ట్రానికి వచ్చాక 2లక్షల రుణమాఫీ ఉండనున్నట్లు తెలుస్తోంది. మొదటి విడతలో భాగంగా లక్ష లోపు రుణాలను మాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందుకోసం 6వేల 93 కోట్లు బ్యాంకులకు చెల్లించింది. మూడు దశల్లో చేయనున్న రుణమాఫీకి మొత్తం 31వేల కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. మూడో విడత రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి కల్వకుర్తిలో కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 2 నుంచి 14 వరకు తాను విదేశీ పర్యటనకు వెళ్తున్నానని.. తిరిగి వచ్చిన తర్వాతే 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ సభ వేదికగా రేవంత్ స్పష్టత ఇచ్చారు.

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్