29 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

‘రాజాసాబ్’ గ్లింప్స్: ప్రభాస్ లుక్ అదిరిపోయిందిగా!

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘రాజాసాబ్’ మూవీ నుంచి గ్లింప్స్ వీడియో రిలీజ్ అయింది. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ మోస్ట్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇలాంటి క్యూట్ లుక్‌లో కనిపించబోతున్నారు. అందుకే గ్లింప్స్‌లో ప్రభాస్ తన అందాన్ని చూసి తానే మురిసిపోతున్నట్లు చూపించారు డైరెక్టర్ మారుతి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమాను డైరెక్టర్ మారుతి తనకు తెలిసిన హారర్ రొమాంటిక్ కామెడీ జోనర్స్‌ను మిక్స్ చేసి తీసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది వేసవిలో ఏప్రిల్ 10న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీ “రాజా సాబ్” ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ అందరినీ థ్రిల్ చేస్తోంది. ప్రభాస్ వింటేజ్ లుక్ లో ఛార్మింగ్ గా కనిపించారు. “రాజా సాబ్” సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూఛిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో “రాజా సాబ్” సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తున్నారు. “రాజా సాబ్” సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయబోతున్నట్లు ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ ద్వారా మేకర్స్ అనౌన్స్ చేశారు.

బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ మూవీస్ తో సక్సెస్ కు కేరాఫ్ గా మారిన ప్రెస్టీజియస్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ “రాజా సాబ్” సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్ గా ప్రొడ్యూస్ చేస్తోంది. “రాజా సాబ్” సినిమా తమ సంస్థలో ఒక మెమొరబుల్ మూవీగా మిగిలిపోయేలా నిర్మిస్తోంది. “రాజా సాబ్” సినిమా షూటింగ్ 40 పర్సెంట్ పూర్తయింది. ఆగస్టు 2వ తేదీ నుంచి మరో భారీ షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రభాస్ ను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయబోతున్నారు డైరెక్టర్ మారుతి.

నటీనటులు – ప్రభాస్, తదితరులు

టెక్నికల్ టీమ్

ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ – కార్తీక్ పళని
మ్యూజిక్ – తమన్
ఫైట్ మాస్టర్ – రామ్ లక్ష్మణ్, కింగ్ సోలొమన్
వీఎఎఫ్ఎక్స్ – ఆర్.సి. కమల్ కన్నన్
ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ కేఎన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా, వంశీ కాకా
కో ప్రొడ్యూసర్ – వివేక్ కూచిభొట్ల
ప్రొడ్యూసర్ – టీజీ విశ్వప్రసాద్
రచన, దర్శకత్వం – మారుతి

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్