ఆ సీట్ మీద పవన్ కళ్యాణ్ ఫోకస్ చేస్తున్నారా..!

తెలుగుదేశం జనసేన మధ్య సీట్లు పంపకం ప్రారంభం కాకముందే గాజువాక సీటుపై యుద్ధం మొదలైంది.. గత ఎన్నికల్లో గాజువాక నుంచి తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేశారు కాబట్టి ఆ సీటు తమకే ఇవ్వాలని జనసేన పట్టుబదుతుంది. జనసేన అధ్యక్షుడే పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో జనసేనకు సీటు ఎందుకు ఇవ్వాలని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.. రెండు పార్టీల అధినేతల మధ్య సీట్లు సర్దుబాటు ప్రారంభం కాకముందే నేతల మధ్య వివాదం మొదలయ్యింది..

గాజువాక నుంచి గత ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేశారు.. వైయస్సార్సీపీ అభ్యర్థి తిప్పన నాగిరెడ్డి చేతిలో ఘోర పరాజయం పొందారు.. ఆ ఎన్నికల్లో టిడిపి తరఫున పల్లా శ్రీనివాస్ పోటీ చేశారు. టిడిపి తరఫున పల్లా శ్రీనివాస్ పోటీ చేసినప్పటికీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం టిడిపి తరుపున ప్రచారానికి కూడా రాలేదు.

గత ఎన్నికల్లో తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి జనసేన టిడిపి పొత్తులో భాగంగా ఈసారి తమకే సీటు కేటాయించాలని జనసేన నాయకులు కోరుతున్నారు.. జనసేన తరఫున పోటీ చేయడానికి పార్టీ ఏపీసీ సభ్యుడు కోన తాతారావు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో జనసేన తరఫున ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే సీటు వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు..

గాజువాకలో జరిగిన బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో గాజువాక నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.. మొదటినుంచి పార్టీని నమ్ముకుని రాజకీయం చేస్తున్నానని అవకాశవాద రాజకీయం కోసం తానేమి ఇటీవల కాలంలో పార్టీలోకి కొత్తగా రాలేదంటున్నారు.. నమ్మిన పార్టీని వెన్నుపోటు పొడిచి పదవులు అనుభవించి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ లాగా తమ నాయకుడు పార్టీలోకి రాలేదని కోన తాతారావు అనుచరులు గుర్తు చేస్తున్నారు..

స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఇక్కడ ప్రభావం చూపుతోంది. ఉద్యమంలో చురుకుగా పనిచేయటం కోన తాతారావు కి బాగా కలిసి వస్తోంది. ముఖ్యంగా సామాజిక సమీకరణాలు కూడా ప్లస్ పాయింట్ అనే అనుకోవాలి. మొత్తం మీద జనసేన కు ఇది బలమైన సీటు అని పవన్ అభిమానులు లెక్కలు వేస్తున్నాురు.

మరోవైపు టిడిపి కూడా గాజువాక స్థానాన్ని గట్టిగా ఆశిస్తుంది.. గత ఎన్నికల్లో టిడిపి తరఫున పల్లా శ్రీనివాస్ పోటీ చేసినప్పటికీ క్యాడర్ మొత్తం చంద్రబాబు ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలిపింది అంటున్నారు.. అధ్యక్షుడే స్వయంగా పోటీ చేసి ఓడిపోయిన గాజువాక సీటును మళ్లీ ఎందుకు జనసేనకి ఇవ్వాలని టిడిపి నేతలు మాట్లాడుతున్నారు.. ఇక్కడ ఇదే స్థానం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా శ్రీనివాస్ మరోసారి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు.

జనసేనకు పోలిస్తే టిడిపి ఇక్కడ బలంగా ఉందంటున్నారు. తమను కాదని జనసేనకి సీటు ఇచ్చినట్లయితే సహకరించేది లేదని టిడిపి నేతలు అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. జనసేనకు సీటు ఇచ్చినట్లయితే తమ దారి తాము చూసుకునేందుకు సిద్ధమనే సంకేతాలను పంపుతున్నారు. సీట్లు పంపకం మొదలుకాకముందే గాజువాక నియోజకవర్గంలో టిడిపి జనసేన నాయకులు మధ్య అగ్గి రాజకుంది.. ఈ సీటు వివాదం రానున్న రోజుల్లో ఎటువంటి పరిస్థితులకు దారితీసుకుందో చూడాలి మరి

Latest Articles

అశాంతిగా విజయశాంతి

ఆమె సినీ రంగంలో లేడీ సూపర్ స్టార్. ఆ తర్వాత రాజకీయ రంగంలోను రాణించారు. ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. ఫైర్ బ్రాండ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్