నవంబర్‌ 1 వరకు అమెరికాలో పర్యటించనున్న మంత్రి నారా లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్‌ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇవాళ్టి నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు అగ్రరాజ్యంలో ఆయన పర్యటిస్తారు. US టూర్‌లో పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలపై చర్చిస్తారు. ఇందులో భాగంగా శాన్‌ఫ్రాన్సిస్కోలో ఒరాకిల్ సంస్థ ప్రతినిధులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు.

పత్ర సినర్జీస్‌, బోసన్‌, స్పాన్‌ ఐవో, క్లారిటీ, ఎడోబ్‌, స్కేలర్‌, జనరల్ అటమిక్స్‌ సంస్థల ప్రతినిధులు, భారత కాన్సుల్ జనరల్‌తో ఇవాళ భేటీ అవుతారు. ఆస్టిన్‌లోని పలు కంపెనీల ప్రతినిధులతో రేపు సమావేశమవుతారు. ఈనెల 28న రెడ్‌ మండ్‌లో మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులతో భేటీ కానున్నారు. 29న అమెజాన్‌ సహా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం కావడంతో పాటు ఐటీ సర్వ్‌ సినర్జీ సదస్సులో కీలక ప్రసంగం చేయనున్నారు. ఈనెల 30న కూడా వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారు. 31న జార్జియాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. న్యూయార్క్‌లో పెట్టుబడిదారులతో నవంబర్‌ 1న సమావేశమవుతారు నారా లోకేశ్.

Latest Articles

అశాంతిగా విజయశాంతి

ఆమె సినీ రంగంలో లేడీ సూపర్ స్టార్. ఆ తర్వాత రాజకీయ రంగంలోను రాణించారు. ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. ఫైర్ బ్రాండ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్