మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా హైదరాబాద్‌లో జరిగిన ది సదరన్ రైజింగ్ సదస్సులో వారిద్దరు కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. అయితే,.. ఈ సదస్సులో జరిగిన ఆసక్తికర దృశ్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రామ్మోహన్ నాయుడు, కేటీఆర్ మధ్య ఆత్మీయ క్షణాలు చోటు చేసుకున్నాయి. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. రామ్మోహన్ నాయుడుని ఆత్మీయంగా హత్తుకున్న కేటీఆర్… వీపు తట్టి అభినందనలు తెలిపారు. అయితే,.. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు.