పాలకుర్తిలోనూ హైడ్రా అమలు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. ఇక్కడ కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్న మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ముసుగులో కాంగ్రెస్ నాయకులపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చినమడూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గొడవలు జరిగితే కాంగ్రెస్ నాయకులపై బురదజల్లే ప్రయత్నం చేయడం ఎర్రబెల్లి, బీఆర్ఎస్ నాయకుల విజ్ఞతకే వదిలి వేస్తున్నామని యశస్విని రెడ్డి అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పినా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులో మార్పు రాలేదని పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ ఝాన్సి రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని, ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఎర్రబెల్లి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎర్రబెల్లి కుట్రలను, జిమ్మిక్కులను పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు ఝాన్సీ రెడ్డి.