తిరుమలలో కల్తీ నెయ్యి వాడకం, ఇతర అధికార దుర్వినియోగాలపై సిట్ ఏర్పాటు చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఇవాళ సిట్ టీమ్‌తో పాటు టీమ్ సభ్యులను కూడా ప్రకటించబోతుంది. ఐజీ అంతకంటే పైస్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. సిట్ టీమ్ ఏర్పాటుపై నిన్న సీఎం చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమలరావు చర్చించారు.
సిట్ టీమ్‌కు సంబంధించి పలువురు పేర్లను పరిశీలిస్తున్నారు చంద్రబాబు. IPS పీహెచ్‌డీ రామకృష్ణ, సర్వశ్రేష్ట త్రిపాఠి ,వినీత్ బ్రిజ్‌లాల్, సీహెచ్ శ్రీకాంత్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ బృందం నెయ్యి కొనుగోలు, టెండర్లపై దర్యాప్తు జరపనుంది. నిర్దేశిత సమయంలోగా నివేదిక అందించేలా సిట్ టీమ్ కు ఆదేశాలు జారీ చేయనుంది ప్రభుత్వం. సిట్ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ చేయిస్తానని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. సిట్ నివేదిక అనంతరం కల్తీ నెయ్యి బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వం సిట్ నివేదిక తర్వాత మరిన్ని సంస్కరణలు, చర్యలకు ఉపక్రమించనుంది.