పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలందరూ సామాజిక బాధ్యత కలిగి ఉండాలని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన స్వచ్ఛ భారత్, స్వచ్చ తెలంగాణ కార్యక్రమంలో పాల్గొన్నారు పొన్నం. ఈ సందర్భంగా ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద గణేష్ నిమజ్జన వ్యర్ధాలను మున్సిపల్ అధికారులతో కలిసి తొలగించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకున్నామని, ఆ ఉత్సవాలు నిమజ్జనం చేయడంతోనే ముగియలేదన్నారు. గణేష్ విగ్రహాలను ఏ జలాశయలు, చెరువుల్లో అయితే వేశమో ఆ వ్యర్ధాలను అక్కడి నుండి తొలగించినప్పుడే గణేష్ ఉత్సవాలు పరిపూర్ణమవుతాయని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జలాశయాలు, చెరువులలో నిమజ్జన వ్యర్ధాలను గణేష్ మండప నిర్వాహకులు తొలగించాలని కోరారు.