లైంగిక దాడి కేసులో అరెస్ట్ అయిన సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ నార్సింగి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. ప్రస్తుతం జానీ మాస్టర్ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నాడు. తనను లైంగికంగా వేధించడంతోపాటు బెదిరింపులకు, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడినట్టు బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ నిమిత్తం ఆయనను ఐదు రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగించాలని నార్సింగి పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు బెయిల్ మంజూరు చేయాలని జానీ మాస్టర్ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే, బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు విచారణను వాయిదా వేసింది.