మాస్ రాజా ప్లాన్ అదిరింది..

మాస్ మహారాజా రవితేజ హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా.. ఏమాత్రం గ్యాప్ లేకుండా.. వరుసగా సినిమాలు చేస్తుంటారు. ఇరుముడి అనే ఫీల్ గుడ్ మూవీతో రాబోతున్న మాస్ రాజా.. ఈసారి మాస్ అండ్ యాక్షన్ మూవీని ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా.. రవితేజ లైనప్ అదిరింది అనేది ఇన్ సైడ్ న్యూస్. ఇంతకీ.. మాస్ అండ్ యాక్షన్ మూవీని ఎవరితో చేయనున్నాడు..? అసలు.. రవితేజ లైనప్ ఏంటి..?

మాస్ మహారాజా రవితేజకు కథ నచ్చితే చాలు.. ఆ డైరెక్టర్ సక్సెస్ లో ఉన్నాడా..? ఫ్లాపుల్లో ఉన్నాడా..? అనేది పట్టించుకోరు. సినిమా చేసేందుకు రెడీ అంటుంటారు. వరుసగా ప్లాపులు వచ్చినా స్పీడు మాత్రం తగ్గడం లేదు. అదే స్పీడుతో సినిమాలు చేస్తున్న మాస్ రాజా నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇరుముడి ఆగష్టు 21న రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ మూవీ పై భారీగా అంచనాలు ఉన్నాయి.

ఇరుముడి తర్వాత రవితేజ సింగం మూవీ డైరెక్టర్ హరితో సినిమా చేయనున్నారని.. ఇది మాస్ అండ్ యాక్షన్ మూవీ అని ప్రచారం జరుగుతుంది. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా హరి స్టోరీ రెడీ చేసారని.. త్వరలోనే ఈ సినిమాని అనౌన్స్ చేస్తారని టాక్. అలాగే దిల్ రాజు బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయ‌బోతున్నాడట రవితేజ. ఓ కొత్త ద‌ర్శ‌కుడుతో ఈ సినిమా ఉంటుందని.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని సమాచారం.

రవితేజతో సినిమా చేసేందుకు యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కూడా లైన్లో ఉన్నారు. వివేక్ క‌థ‌ల‌న్నీ సెన్సిటీవ్ గా ఉంటాయి. ఆయన సినిమాల్లో ఫ‌న్ ఉంటుంది. సో.. ర‌వితేజ‌ను కొత్త‌గా చూసే అవ‌కాశం ఉంది. రవితేజ కోసం వెయిటింగ్లో ఉన్న మరో డైరెక్టర్ మారుతి. ర‌వితేజ‌కు ఇటీవ‌ల ఓ క‌థ చెప్పిన‌ట్టు స‌మాచారం. రాజాసాబ్ ప్లాప్ తర్వాత మారుతి కొంత మంది హీరోల్ని కలవడం కథ చెప్పడం జరిగింది కానీ.. సెట్ కాలేదు. చివరికి మాస్ రాజా దగ్గరకు చేరినట్టు తెలుస్తోంది. మొత్తానికి ర‌వితేజ లైన‌ప్ మాత్రం స్ట్రాంగ్ గానే ఉంది.. అదిరింది అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి.. ఇరుముడి బ్లాక్ బస్టర్ అయితే.. మాస్ రాజా మరింత స్పీడు పెంచడం ఖాయం.

Latest Articles

ఉత్తరాఖండ్‌లో విశాఖకు చెందిన ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద మృతి

ఏపీలోని విశాఖపట్నంకు చెందిన 27 ఏళ్ల ఐటీ ఉద్యోగిని ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో ఓ హోమ్‌స్టేలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. రాధా గాయత్రి గురుగ్రామ్‌లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. ఢిల్లీలోని కిద్వాయ్‌ నగర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్