విద్యారంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదవటం నామోషీ అనే ఆలోచన పోవాలని సూచించారు. ప్రభుత్వ బడుల్లో చదివి ఐఏఎస్, ఐపీఎస్, సీఎంలు అయినవాళ్లు ఉన్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం వర్గానికొక స్కూల్ పెట్టి.. కుల వ్యవస్థను ప్రోత్సహించిందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటూ కులానికొక స్కూల్ పెట్టారని అన్నారు. కుల వ్యవస్థను నిర్మూలించేందుకే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. త్వరలోనే యంగ్ ఇండియా స్పోర్ట్స్ మూనివర్సిటీని ప్రారంభిస్తామని వెల్లడించారు.
మెస్సీని హైదరాబాద్‌కు తీసుకువస్తే .. విమర్శలు చేశారు- రేవంత్ రెడ్డి
క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపేందుకే మెస్సీని తీసుకువచ్చాం- రేవంత్ రెడ్డి
గత ప్రభుత్వం యూనిఫామ్‌లు ఇస్తే.. నెలరోజులకే చినిగాయి- సీఎం
ఈ ప్రభుత్వం నాణ్యమైన వస్తువులతో విద్యాకిట్ ఇస్తోంది- సీఎం


