శాసనమండలిలో ఏపీలో నేరాలపై చర్చ సంరద్భంగా ఏపీ హోం మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని హోం మంత్రి అనిత అన్నారు. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వారిని అరెస్టు చేస్తున్నామని తెలిపారు. ముచ్చుమర్రి ఘటనలో యువతిని గుర్తించడానికి సమయం పట్టిందని తెలిపారు. పరామర్శకు వెళ్లిన తమపైనే కేసులు పెట్టారని విమర్శించారు.
దిశచట్టం గురించి గొప్పగా చెబుతున్నారని, అసలు దిశ చట్టం ఉందా అని ప్రశ్నించారు హోం మంత్రి అనిత. గంజాయిపై గత ఐదేళ్లలో ఒక్క సమీక్ష అయినా చేశారా? అని నిలదీశారు. తమ ప్రభుత్వమే మహిళల భద్రతకు పెద్దపీట వేసిందని తెలిపారు. గతంతో పోలిస్తే తమ ప్రభుత్వ హయాంలో క్రైమ్ తగ్గిందని తెలిపారు.