మూసీ నది సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరుగుతోందన్న కేటీఆర్ కామెంట్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే దానం నాగేందర్. మూసి ప్రక్షాళన కోసం పదివేల కోట్లతో రివర్ బోర్డు ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో 32 కొత్త STP ప్లాంట్లకు శంకుస్థాపన చేస్తే.. నాలుగు ఐదు మినహా మిగతా వాటి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం బాధ్యతతో STP ప్లాంట్లను పూర్తిచేస్తుందని తెలిపారు. మూసీ నది వెంట అన్యాక్రాంతమైన భూమిలో 12 వేల ఇళ్లు ఉన్నట్లు గత ప్రభుత్వమే గుర్తించిందని..కానీ ఇప్పుడు కేటీఆర్ రాజకీయ రంగు పులుముతున్నారని దానం మండిపడ్డారు.