తిరుమల లడ్డూ మహా ప్రసాదం వ్యవహారంపై నటుడు ప్రకాశ్ రాజ్ పోస్టుల పరంపర కొనసాగుతోంది. జస్ట్ ఆస్కింగ్ అంటూ వరుస పోస్టులు పెడుతున్నారు. తాజాగా మరో పోస్ట్ పెట్టారు. మనకేం కావాలి… ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా.. లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన, అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవడమా .. జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్ పెట్టారు. ఆయన ఎవరిని ఉద్దేశించి పెట్టారు.. ఎందుకు పెట్టారు.. అంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.