తెలంగాణ ప్రభుత్వ తీరుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు. డీజేలపై నిషేధం సరైంది కాదన్నారు. వాహనాలకు స్పీడ్ లిమిట్ ఎలా ఉంటుందో.. అదే మాదిరిగా డీజేలకు సౌండ్ లిమిట్ పెట్టాలన్నారు. రాజకీయ పార్టీలతో పోలీస్ కమిషనర్ సమావేశం మొక్కుబడిగా.. అందర్నీ పిలిచి మాట్లాడినట్లుగా ఉందని విమర్శించారు. ప్రభుత్వ చర్యలు హిందువుల ఉత్సవాలను టార్గెట్ చేస్తున్నట్లుగా ఉందని ఆరోపించారాయన. కేసులు పెట్టినా ఏం చేసినా యథావిధిగా మా ఉత్సవాలు నిర్వహించుకుంటామన్నారు. ఆలయాల్లో మైకులు తీసేస్తే మసీదుల్లోనూ మైక్‌లను తీసేయాల్సిందేనని స్పష్టం చేశారు రాజాసింగ్.