ఏలూరు జిల్లా పోతురెడ్డిపల్లి చెరువులలో చిన్నారుల ఆటలు ప్రమాదకరంగా మారాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి సెలవులతో పాఠశాలలు మూతపడటంతో చిన్నారులు ఇంటి వద్ద ఉంటూ చెరువు పరిసరాల్లో ఆటలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇంటి పెద్దలు పనుల్లో నిమగ్నమైనప్పుడు చిన్నారులు చెరువుల వద్దకు వెళుతున్నారని గ్రామస్తులు హెచ్చరించారు. గతంలోని ఘటనలను గుర్తు చేస్తూ తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెరువుల వద్ద రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని వారు కోరారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, చిన్నారుల భద్రతకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు స్థానికులు.
ప్రమాదకరంగా చెరువుల వద్ద చిన్నారుల ఆటలు
0
93
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


