మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. రెండో వార్డులో భూ వివాదం కాస్తా రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు కర్రలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురికి తలలు పగిలి రక్తగాయాలయ్యాయి. బీజేపీ అధికార ప్రతినిధి బుల్లెట్ కృష్ణానాయక్ కుటుంబ సభ్యులకు, అలాగే రెండో వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ బానోత్ భద్రమ్మ, శ్రీను వర్గీయులకు మధ్య ఈ గొడవ జరిగింది. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించే క్రమంలోనూ తిరిగి దాడులకు యత్నం చేశారు. పోలీసులు భారీ బందోబస్తు నడుమ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ నివురుగప్పిన నిప్పులాంటి వాతావరణం నెలకొంది.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో ఉద్రిక్తత
0
64
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


