తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణపై చర్చించనున్నారు. ఫ్యూచర్ సిటీలో పలు ఫార్మా కంపెనీలకు శంకుస్థాపనలు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అధారిటీ భవనానికి శంకుస్థాపన, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, కొత్త రేషన్ కార్డుల పంపిణీ వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధివిధానాల ఖరారు చేయనుంది కేబినెట్. ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్ ట్రస్ట్ పాలసీ, భూముల విలువ పెంపు, రిజిస్ట్రేషన్ ల ద్వారా వచ్చే ఆదాయం పై చర్చించనున్నారు. ధాన్యం కొనుగోలుపై జిల్లాల వారీగా కేబినెట్‌లో సమీక్షించనున్నారు. ఇక రాష్ట్రంలో పథకాల అమలు తీరుపై చర్చించనుంది కేబినెట్.
తెలంగాణ కేబినెట్ ప్రారంభం
0
47
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


