రాష్ట్రాభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుకుంటోందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదన్నారు. అధికారంలోకి వస్తామని హరీశ్‌రావు పగటికలలు కంటున్నారని.. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని అంటున్నారని మండిపడ్డారు. హరీష్ రావు ప్రకటన బాధ్యతారాహిత్యమని చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీతో నే తెలంగాణాకు బ్రాండ్ ఇమేజ్ వస్తుందన్నారు. హరీశ్ మాట్లాడే ప్రతి మాట తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసేవిగా ఉన్నాయన్నారు. హరీష్ రావు తెలంగాణ యువతకు ఉద్యోగాలు, ఉపాధి రాకుండా చేస్తున్నారని మండిపడ్డిరు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి బీఆర్ఎస్ స్వార్ధ రాజకీయాలకు తెరలేపుతుందని ఆరోపించారు. కంపెనీలు, వ్యవస్థలను పక్క రాష్ట్రాలకు పోయేలా చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బుల్లెట్ రైలుపై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు.
బీఆర్ఎస్ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటోంది- మంత్రి శ్రీధర్ బాబు
0
25
Previous article
Latest Articles
ఆస్పత్రిలో పవన్ ను పరామర్శించా.. అక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడారు- చంద్రబాబు
ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా కృషి చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తుంగభద్ర గేట్లు కొట్టుకు పోతే 34 గేట్లు పునరుద్ధించామని చెప్పారు. 12...
- Advertisement -
- Advertisement -


