ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 11.35 గంటలకు బెంగళూర్ నుంచి సీఎం సింగపూర్ బయల్దేరి వెళ్లనున్నారు. 2026 సీఐఐ పెట్టబడుల సన్నాహక రోడ్ షోలో చంద్రబాబు పాల్గొంటారు. సింగపూర్ ప్రధాని, మంత్రులు, పారిశ్రామికవేత్తలతో సీఎం బృందం వరుస భేటీలు కానున్నారు.
సింగపూర్ చేరుకున్న అనంతరం 15వ తేదీన సింగపూర్ కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు ఆ దేశంలోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో మొదటగా సీఎం సమావేశం అవుతారు. పర్యటనలో తొలిరోజు స్టార్టప్ వెంచర్ కాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుకు సీఎం హాజరవుతారు. అనంతరం యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రాస్ బాచ్ తో విందు సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.


