నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని సంఘం మండలం దువ్వూరులో ఉపాధ్యాయుడు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. కారణాలు ఏంటో తెలియదు గానీ కుటుంబ యజమాని మధుసూదన్ రావు , ఆయన భార్య. కుమారుడు ఉరివేసుకొని తమ నివాసంలో మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘం గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు పాల్పడిన మధుసూదన్ రావు కుటుంబం సూసైడ్ లేఖ రాశారు. చనిపోయే ముందు రాసిన ఆ లేఖను బీరువాలో ఆల్బమ్ లో ఉందంటూ సమాచార పత్రాన్ని తమ వద్ద ఉంచుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సంఘం పోలీసులు డెడ్ బాడీలను స్వాధీనం చేసుకొని మృతికి గల కారణాలపై విచారణ ప్రారంభించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
నెల్లూరు జిల్లాలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
0
28
Latest Articles
SIRపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం -రామచందర్ రావు
SIRపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. ఇప్పటివరకు 12 సార్లు ఓటర్ల సమగ్ర సవరణ జరిగిందని చెప్పారు. ఓటర్ల సవరణ చేయడం ఇది తొలిసారి...
- Advertisement -
- Advertisement -


