సత్యదేవ్ నటిస్తున్న రావు బహదూర్ మూవీ పై ముందు నుంచీ మంచి అంచనాలే ఉన్నాయి. సత్యదేవ్, వెంకటేష్ మహా కాంబినేషన్ లో రూపుదిద్దుకొన్న సినిమా ఇది. నాట్ జస్ట్ ఏ టీజర్ అంటూ అప్పట్లో ఓ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అది నిజంగా ట్రైలర్‌ని మించి పోయింది. ఇప్పుడు జస్ట్ ఏ టీజర్ అంటూ మరోటి రిలీజ్ చేశారు. ఇది ఏకంగా సినిమాని మించి ఉంది. ఇంతకీ.. రావు బహదూర్ టీజర్ ఎలా ఉంది..? ఈ మూవీ అయినా సత్యదేవ్ కి ఆశించిన సక్సెస్ అందిస్తుందా..? లేదా…?
సత్యదేవ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కానీ.. నటుడుగా మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. తన ప్రతి సినిమాలో కొత్తదనం చూపించాలని తపిస్తున్న సత్యదేవ్.. ఈసారి రావు బహదూర్ అంటూ డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పుడు జస్ట్ ఏ టీజర్ అంటూ రిలీజ్ చేశారు. ఇది ఏకంగా సినిమాని మించి ఉంది. మూడున్నర నిమిషాల పాటు సాగిన టీజర్‌లో రావు బహదూర్ ప్రపంచాన్నే పరియయం చేసేశాడు దర్శకుడు వెంకటేష్ మహా. ఆ ప్రపంచం, పాత్రలు, మరీ ముఖ్యంగా రావు బహదూర్ గా సత్యదేవ్ క్యారెక్టర్, గెటప్ అన్నీ చిత్రవిచిత్రంగా ఉన్నాయి.
కథేమిటో పూర్తిగా చెప్పలేదు కానీ.. ఖచ్చితంగా ఇప్పటి వరకూ చూడని ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి ఈ మూవీ టీమ్ కష్టపడినట్టు అర్థం అవుతోంది. సత్యదేవ్ కెరీర్ బెస్ట్ పెర్ ఫార్మెన్స్ ఇచ్చాడని, తనకు అవార్డులు రివార్డులు ఖాయం అని టీమ్ మెంబర్స్ ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. అయితే.. ఆ మాట ఎందుకు అన్నారో ఈ టీజర్ చూస్తే తెలుస్తుంది. జలై 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోవడం విశేషం. ఆయన పేరుతో ఈ సినిమాకు మరింత ప్రమోషన్ దొరకబోతోంది. మహేష్ ఈ మూవీ టీజర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఈ మూవీ పై సత్యదేవ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి.. సత్యదేవ్ ఆశలు నిజమై.. ఆశించిన విజయాన్ని సొంతం చేసుకుంటాడేమో చూడాలి.


