తమిళనాడులో ఘోరం జరిగింది. మూడేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన తిరువల్లూర్ జిల్లాలో జరిగింది. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై ఆకృత్యాలు పెరిగిపోవడంతో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ కేసులో బిహార్‌కు చెందిన వలస కార్మికుడిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. మృతిచెందిన చిన్నారి కుటుంబం కూడా బిహార్ నుంచి వలస వచ్చి గుమ్మిడిపూండికి చెందిన SIPCOT పారిశ్రామిక ప్రాంతంలో స్థిరపడింది.
తీవ్ర గాయాలతో చిన్నారి ఆదివారం పొదల్లో దొరికింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. చిన్నారికి నిందితుడు ముందే పరిచయం ఉన్నాడని పోలీసులు తెలిపారు. బిస్కెట్ ఇస్తానని ఆశ చూపి తన వెంట తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు.


