భారత కొత్త ఆర్మీ చీఫ్‌గా ధీరజ్ సేథ్ నియమితులయ్యారు. ఉపేంద్ర ద్వివేది స్థానంలో ధీరజ్ సేథ్‌ను నియమించారు. ఈ నెల 30న ధీరజ్ సేథ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం LT జనరల్‌గా ధీరజ్ సేథ్ విధులు నిర్వర్తిస్తున్నారు.
దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కొనసాగిన విశిష్ట సైనిక సేవా జీవితంలో ఆయన కార్యాచరణ, వ్యూహాత్మక ప్రణాళికలు, సామర్థ్యాభివృద్ధి, సంస్థాగత వ్యవహారాలు వంటి అనేక కీలక రంగాల్లో విస్తృత అనుభవాన్ని సంపాదించారు. భారత సైన్యం యుద్ధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, దీర్ఘకాలిక ఆధునికీకరణ , రూపాంతర ప్రక్రియల్లో కూడా ఆయన విశేషమైన సేవలు అందించారు.


