స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద వ్యూ పాయింట్ నుండి పోలవరం పనులను పలువురు అధికారులతో సీఎం జగన్ పరిశీలించారు. ప్రాజెక్టులోని డయా ఫ్రమ్ వాల్ స్పిలేవే అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్, ఎర్త్ కం రాక్ ఫీల్డ్ డ్యామ్ పనులను సీఎం సమీక్షించారు. పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు. ప్రాజెక్ట్ లోని కాఫర్ డాం వద్ద ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీ ద్వారా పనుల పురోగతిని ఇరిగేషన్ అధికారులు సీఎం జగన్ కు వివరించారు. అనంతరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ అధికారులతో సీఎం సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.